![]() |
![]() |
.webp)
అలీ అంటే చాలు గుర్తొచ్చే సినిమా సీతాకోక చిలుక. ఆ సినిమా డైరెక్టర్ భారతి రాజా గారు. ఈ టీనేజ్ లవ్ స్టోరీ అప్పట్లో ఒక ఊపు ఊపేసిన సినిమా. అలాంటి సినిమాలో అలీ నటన గురించి మాటల్లో చెప్పలేము. అలాంటి అలీ ఇప్పుడు భారతి రాజా గారిని చూడడానికి వెళ్లలేకపోయానంటూ బాధపడ్డారు. "మా గురువు గారు భారతి రాజా గారు. తమిళ్ లో ఫస్ట్ ఫిలిం కళుక్కుళ్ యీరం అనే మూవీలో ముచ్చెర్ల అరుణని పరిచయం చేశారు. తర్వాత సీతాకోక చిలుక మూవీలో కూడా అరుణ ఉంటే బాగుంటుంది అని ఆమెను హీరోయిన్ గా నన్ను చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం చేశారు.
ఈ రోజు భారతదేశంలో ప్రతీ తెలుగు వారికి మేమిద్దరం తెలుసు అంటే అది భారతి రాజా గారి పుణ్యం వల్లనే. డైరెక్టర్ ఎప్పుడూ గ్రేట్. డైరెక్టర్ అనేవాడు లేకపోతే నటుడు అనే వాడు పుట్టడు. సీతాకోకచిలుక సినిమా నుంచి ఇద్దరు స్టార్స్ పుట్టారు నేను, అరుణ గారు. ఆయన చాలా గ్రేట్ డైరెక్టర్ . ఎందుకంటే శివాజీ గణేశన్ గారిని డైరెక్ట్ చేసిన గొప్ప దర్శకుడు . భారతి రాజా గారు ఈ రోజున మన మధ్యలో లేరు అని వార్త వినగానే నిజంగా మనసుకెంతో బాధ అనిపించింది. నన్ను ఇంట్రడ్యూస్ చేసాక అలీ అనే వ్యక్తి భారతదేశానికి పరిచయం అయ్యాడు. వందల సినిమాల్లో నటించాను ఒక నటుడిగా నిలబడ్డాను అంటే ఆయన దయవల్లే. సీతాకోకచిలుక 46 సంవత్సరాల అయ్యింది. ఆయన పుట్టినరోజు నేను రాధికా వెళ్లాం అంటూ అరుణ గారు ఆ రోజుల్ని గుర్తుచేసుకున్నారు. కానీ ఈ రోజున ఇక్కడ షూటింగ్లో ఉండగా మాకు ఈ వార్త తెలియడం నిజంగా చాలా బాధ కలిగించింది . ఈరోజు షూటింగ్ లేకుండా ఉండుంటే బాగుండేది. చెన్నై వెళ్ళి కనీసం ఆఖరి చూపులు మేము చూసేవాళ్ళం. కానీ కుక్కు విత్ జాతిరత్నాలు షూటింగ్ చాలామంది ఆర్టిస్టులు వచ్చి ఉన్నారు.
వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. కొన్నేళ్ల క్రితం భారతి రాజా గారి అబ్బాయి అనారోగ్య కారణాల వలన మరణించడంతో భారతి రాజా గారు ఎంతో బాధను అనుభవించారు. ఏదేమైనా ఆయన ఇప్పుడు మన మధ్యలో లేరు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. వారి కుటుంబానికి కొండంత ధైర్యం ఇవ్వాలని ఒక నటుడిగా భారతీయరాజా గారి చైల్డ్ ఆర్టిస్ట్ ఆ దైవాన్ని ప్రార్థిస్తున్నాను" అని ఆవేదన వ్యక్తం చేశారు అలీ.
![]() |
![]() |